శ్రీకాకుళంలో సీఎం పర్యటన
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడమూరులో వరదలకు దెబ్బతిన్న ఇళ్లు, చెరువులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నష్టం వివరాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. తుపాను బాధితులకు 10 కిలోల బియ్యం అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, ఇళ్లు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం పూర్తి సాయం అందజేస్తుందని సీఎం స్పష్టం చేశారు.